Posani Murali Krisha Arrest: అతనిని అరెస్ట్ చెయ్యటానికిగల కారణం ఏమిటి?

 



ఆంధ్రప్రదేశ్ పోలీసులు నటుడు పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో నివసిస్తున్న పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును పోలీసులు స్పందన ఏమిటంటే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పవన్ కళ్యాణ్పై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు కేసులు నమోదయ్యాయి. సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేటకు తరలించారు అని సమాచారం.

$ads={1}

అసలు అరెస్ట్కు గల కారణం:

వైసిపి పాలనలో  పోసాని కృష్ణమురళి ఎపిఎఫ్టివిడిసి ఛైర్మన్గా పనిచేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. గత ఏడాది నవంబర్లో ఆంధ్రప్రదేశ్ అంతటా పోసానిపై అనేక ఫిర్యాదులు దాఖలయ్యాయి. కూటమి నాయకుల ఆరోపణలకు ప్రతిస్పందనగా ఏపీ సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. తెలుగు యువత తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు పోసానిపై కూడా కేసు నమోదు చేశారు.

2024 సెప్టెంబరులో జరిగిన విలేకరుల సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ పోసాని చంద్రబాబు గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదు చేసింది. టిటిడి చైర్మన్ బి. ఆర్. నాయుడుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కూడా పోసాని పలు ఫిర్యాదులకు గురయ్యారు.

అంతేకాదు ఓబులవరిపల్లె పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన అభియోగానికి సంబంధించి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సమాచారం ప్రకారం కుల ఆధారిత దుర్వినియోగం మరియు వర్గ భేదాలను రెచ్చగొట్టటం వల్ల ఈ ఫిర్యాదు నమోదైంది. పోసానికి వ్యతిరేకంగా టీడీపీ కూటమి శ్రేణుల నుండి వరుస ఫిర్యాదుల తరువాత పోసాని కృష్ణ మురళి గత ఏడాది నవంబర్లో తాను మళ్ళీ రాజకీయాల గురించి చర్చించబోనని ప్రకటించారు. 

$ads={2}

పోసానిపై నమోదైన కేసుల వివరాలు:

ప్రజల ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై సెక్షన్ 196,353 (2) 111 రెడ్ విత్ 3 (5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పోసాని తనను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులతో గొడవ పడ్డాడు. అయినప్పటికీ అతి కష్టం మీద అతనిని పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. గురువారం ఉదయం వారిని ఓబులవరిపల్లెకు తరలించనున్నారు. తరువాత కోర్టు ముందు ప్రవేశపెట్టవచ్చు.







Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది